
చాకుతో పొడిచి స్పృహ కోల్పోయిన యువతి మెడలో తాళి కట్టాడు
కర్ణాటకలో మైసూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభిషేక్ అనే యువకుడు తనపై ప్రేమ వ్యక్తం చేయాలని ఓ యువతిని ఇబ్బంది పెట్టాడు. ఆమె నిరాకరించడంతో, అతను చాకుతో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న యువతి మెడలో తాళి కట్టి సెల్ఫీ తీసుకున్నాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లిగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు అభిషేక్ కోసం గాలిస్తున్నారు.