అప్పు చెల్లించాలని అడిగినందుకు వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగజీవన్ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎస్ టి వి నగర్ కు చెందిన సురేష్ వివి మహల్ రోడ్డులో వి. ఐ ప్రైవేట్ నెట్వర్క్ షాప్ నిర్వాహకుడిగా ఉన్నాడు. జగజీవన్ పార్క్ వద్ద రోడ్డుపై బీబీకే షాప్ నిర్వాహకుడైన చాన్ బాషా కు రూ.20 వేలు అప్పుగా ఇచ్చాడు. ఇచ్చిన అప్పును అడిగిన సురేష్ పై చాన్ బాషా కత్తితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే సురేష్‌ను రుయా ఆసుపత్రికి తరలించారు.