తిరుపతి: చిరుత దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

71చూసినవారు
తిరుపతి: చిరుత దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
తిరుపతిలోని సైన్స్ సెంటర్ ఎదుట శనివారం ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసింది. మునికుమార్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా అదే సమయంలో అక్కడే మకాం వేసి చిరుత అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో మునికుమార్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్