తిరుపతి స్విమ్స్ లో మరింత ఉన్నతంగా వైద్యసేవలు అందిస్తామని టీటీడీ ఛైర్మెన్ బీ ఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన స్విమ్స్ సమావేశ మందిరంలో బుధవారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఛైర్మెన్ మాట్లాడుతూ స్విమ్స్ లో మరింత ఉన్నతంగా సేవలు అందించేందుకు గత 3నెలల నుండి మాజీ టీటీడీ ఈవో ఐవి సుబ్బరావు అధ్యక్షతన వేసిన ప్రత్యేక ఎక్స్ ఫర్ట్ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించిందన్నారు.