తిరుపతి ఒకటవ డివిజన్ పరిధిలోని పద్మావతినగర్ లో నిర్మించిన ఎంపిపి స్కూల్ ను బుధవారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య ప్రారంభించారు. స్కూల్ ఆవరణను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే స్కూల్ పనులు ప్రారంభించి ఏడాదిలోపే ప్రారంభించుకోవడం విద్యకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.