తిరుపతి: అంకురార్పణతో ప్రారంభమైన పవిత్రోత్సవాలు

829చూసినవారు
తిరుపతి: అంకురార్పణతో ప్రారంభమైన పవిత్రోత్సవాలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 09వతేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మొద‌టిరోజు ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్రప్ర‌తిష్ఠ నిర్వ‌హిస్తారు.

సంబంధిత పోస్ట్