వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు తొక్కిసలాటలో గాయపడి తిరుపతి స్విమ్స్ చికిత్స పొందుతున్న బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం పరామర్శించారు. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పలకరించారు. వాళ్ల బెడ్ వద్ద కింద కూర్చొని బాధితులు చెప్పిన విషయాలు ఆలకించారు. పలువురి హెల్త్ రిపోర్ట్స్ పరిశీలించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.