ఈనెల 14న (సోమవారం)బీఆర్ అంబేద్కర్ జయంతి ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో పోలీస్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కు రావొద్దని తెలిపారు. ప్రజలు ఈవిషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.