ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్, హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్ డీజీ ఆర్కే మీనా కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం శ్రీవారి తెప్పోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయం వద్ద తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుమల పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం డీజీ ఆర్కే మీనా వాహన సేవలో పాల్గొన్నారు.