డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కమిషనర్ ఎన్. మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవ్వరూ తమ సమస్యల పరిష్కారం కొరకు నగరపాలక సంస్థ కార్యాలయంకు రావొద్దని కమిషనర్ తెలిపారు. రానున్న సోమవారం యధావిధిగా ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక జరుగుతుందని ఆమె తెలిపారు.