ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు చెందిన వెల్లియన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2019లో నాగపట్ల బీట్‌లో పట్టుబడిన ఈ కేసులో టాస్క్ ఫోర్సు అధికారులు పగడ్బందీగా సాక్ష్యాలు సమర్పించారు. శిక్షలు నేరస్తులకు హెచ్చరికగా మారుతాయని అధికారులు తెలిపారు.