వైసీపీ తరపున బి. ఫారం తీసుకుని కార్పోరేటర్ అయిన అన్నా అనితా యాదవ్ వైసీపీ ద్వారా వచ్చిన పదవికి ముందు రాజీనామా చేసి తరువాత తమ పార్టీని విమర్శించాలని వైసీపీ నేత, తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ వాసు యాదవ్ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. మాజీ ఉప మేయర్ అభినయ్ రెడ్డి జీవకోనకు వేసిన నూరు మీటర్ల రోడ్డును ఆనాడు ఎందుకు పెండింగ్ లో పెట్టారో సమాధానం చెప్పాలన్నారు.