తిరుపతిలో ఓ కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రూ.32 లక్షలు దోచుకున్నారు. బెంగళూరు పోలీసులు, సీబీఐ అధికారులమని నమ్మించి వీడియో కాల్‌లో బెదిరించిన మోసగాళ్లు. కేసు తప్పించుకోవాలంటే డబ్బు చెల్లించాలన్నారు. దంపతులు అది నమ్మి తమ మూడు ఖాతాల్లో మూడు రోజుల్లో రూ.32 లక్షలు జమచేశారు. అనంతరం తమను మోసం చేసినట్లు గ్రహించి చివరికి పోలీసులను ఆశ్రయించారు.