తిరుపతి కేంద్రీయ బస్టాండ్‌లో బస్సు టాప్ పై నిద్రించిన ఆర్టీసీ డ్రైవర్ వీఎంఎస్ నాయుడు (60) సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. చిత్తూరు-2 డిపోకు చెందిన ఆయన ఆదివారం రాత్రి తిరుపతికి వచ్చిన బస్సుపై కండక్టర్ తో కలిసి నిద్రించారు. ఉదయం 4.30కి బస్సు బయల్దేరాల్సి ఉండగా అయన లేవకపోవడంతో కండక్టర్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి పరిశీలించి మృతి చెందినట్టుగా నిర్దారించారు. కాగా మృతదేహాన్ని 11 గంటల వరకు బస్సుపై నుంచి కిందకు దించకపోవడంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.