తిరుపతి: జూన్ 16 - 19 వరకు టిటిడి పాఠశాలల్లో 'సద్గమయ'

76చూసినవారు
తిరుపతి: జూన్ 16 - 19 వరకు టిటిడి పాఠశాలల్లో 'సద్గమయ'
టిటిడి పాఠశాలల్లో ఈ నెల 16 నుండి 19 తేదీ వరకు సద్గమయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టిటిడి ఈవో జె. శ్యామల రావు తెలిపారు. టిటిడి ఈవో ఛాంబర్ లో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మంతో కలసి సోమవారం హెచ్. డి. పి. పి అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ టిటిడికి చెందిన 7పాఠశాలలలో టిటిడి విద్యార్థులకు దైవభక్తి, నిజాయితీ, క్రమశిక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్