తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం స్వామివారు 7చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం శ్రీసీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారు పుష్కరిణిలో 7చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.