తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు శనివారం కన్నులపండుగగా ముగిశాయి. తొలిరోజు, రెండవరోజు శ్రీమలయప్పస్వామివారు తన ఉభయదేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు.