పత్రికా గొంతుకను అణిచివేయాలనే దురుద్దేశంతో జరిపిన కక్షసాధింపు చర్యలు ఇప్పుడు న్యాయబద్ధంగా ఎదురొడుతున్నాయని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాస్ పై కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి అక్రమ అరెస్ట్ చేయించిన ఘటనపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా నిలిచిందని అన్నారు.