నెల రోజులుగా స్విమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆందోళనతో స్విమ్స్ యాజమాన్యం దిగి వచింది. సమస్యల పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చింది. దీంతో స్విమ్స్ కాంట్రాక్టు కార్మికులు దీక్షలు విరమిస్తున్నట్లు ప్రకటించారు. వారి డిమాండ్ల అంగీకారంతో సిఐటియు ఘన విజయం సాధించింది. శుక్ర, శనివారాల్లో జరిపిన చర్చల్లో సానుకూలంగా యాజమాన్యం నిర్ణయాలు చేస్తామని చెప్పడంతో రిలేదీక్షలు విరమిస్తున్నట్లు ఆదివారం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి వెల్లడించారు.