రామాపురం డంపింగ్ యార్డ్‌ను శనివారం మంత్రి పొంగూరు నారాయణ, సుగుణమ్మ, నరసింహ యాదవ్, మున్సిపల్ అధికారులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ, సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. మున్సిపల్ శాఖ ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలందించేందుకు కట్టుబడి ఉందన్నారు.