సీఎం చంద్రబాబు పర్యటనలో బుధవారం సాయంత్రం ప్రోటోకాల్ రగడ నెలకొంది. సీఎంకు స్వాగతం పలకడానికి వెళ్లిన ఎమ్మెల్యేలను ఎయిర్ పోర్ట్ అధికారులు లోపలికి రానివ్వలేదు. లిస్టులో మీపేర్లు లేవంటూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే థామస్ సహా ఇతర పార్టీ సీనియర్ నేతలను లోపలికి అనుమతించలేదు. చేసేదేమిలేక అసంతృప్తితో సీనియర్ నేతలు వెనుదిరిగారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.