విద్యార్థులు మంచి నైతిక విలువలు అలవరచుకుని, మంచి మార్కులతో రాణించాలని కోరుతూ రిటైర్డ్ హెచ్‌ఎం మధు ఇప్పటివరకు 953 సార్లు తిరుమల కొండపైకి నడిచారు. బైరాగిపట్టెడ్ రామానాయుడి హైస్కూల్లో పనిచేసిన ఈ మాస్టార్ ప్రతిసారి శ్రీవారిని దర్శించి విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రార్థించేవారట. తమ కుటుంబమే కాకుండా విద్యార్థుల కోసం ఇలా తపస్సు చేస్తున్న ఈ గురువు నిస్సందేహంగా గౌరవానికి పాత్రుడే.