టీటీడీ పేరుతో దొంగ మెయిల్స్ సృష్టించి భక్తులను మోసం చేస్తున్న నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడిని సత్యసాయి జిల్లా కొత్తచెరువు మార్కెట్ వీధికి చెందిన బోయ పవన్ కళ్యాణ్ (24)గా పోలీసులు గుర్తించారు. దొంగ మెయిల్స్ ద్వారా వచ్చే రెఫరెన్స్ లెటర్లతో రూ. 90వేల వరకు వసూలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. టీటీడీ నకిలీ వెబ్ సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచిస్తున్నారు.