తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, లడ్డూ కౌంటర్లలో మంగళవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ముందుగా ఆయన శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని తనిఖీ చేసి, వంటల తయారీ, వంట సామాగ్రి నిల్వ, శుభ్రతను పరిశీలించారు. అనంతరం భక్తులతో ఆయన మాట్లాడుతూ అన్నప్రసాదం నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.