శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్న టిటిడి ఉద్యోగుల సమస్యలను నిర్దేశించన సమయంలో పరిష్కరించాలని అధికారులను టిటిడి ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టిటిడిలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఈవో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ టిటిడి పరిధిలోని ఉద్యోగుల సమస్యలను నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని సూచించారు.