టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 15న వెంకటపాలెంలో నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అమరావతిలో టీటీడీ ఈవో, జేఈవోలు అధికారికంగా గురువారం ఆహ్వానం అందించారు. మంత్రి ఆనంతో టీటీడీ అధికారులు సమావేశమై ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, స్వామి వారి కళ్యాణ వేదిక ఏర్పాట్ల గురించి వివరంగా చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన ఏర్పాట్లు జరిగేలా చూడాలని అన్నారు.