తిరుమల శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీపై బుధవారం టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి జనవరి 9న టోకెన్లు జారీ చేయనున్నారు. తదుపరి రోజులకు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 91 కౌంటర్లు టోకెన్లు జారీ చేయనున్నట్లు ఈవో ప్రకటించారు.