తిరుమలలో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు టీటీడీ కీలక చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనంలో మాత్రమే వడ్డిస్తున్న వడలను ఇకపై రాత్రి భోజనంలో కూడా అందించనుంది. ఆదివారం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వడలను భక్తులకు స్వయంగా వడ్డించారు. రోజుకు సుమారు 75వేల వడలు ప్రత్యేకంగా తయారు చేస్తూ, ఉదయం 11గంటల నుంచి రాత్రి 10వరకు వడ్డించనున్నట్లు తెలిపారు.