తిరుపతి-తిరుమల పర్యటన నిమిత్తం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు ఆదివారం రాత్రి చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఘన స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రి గోయల్‌ను ఆత్మీయంగా ఆహ్వానించారు. రేపు కేంద్ర మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.