తిరుపతి: గుడి కూల్చివేతపై గ్రామస్తుల ఆగ్రహం

85చూసినవారు
తిరుపతి: గుడి కూల్చివేతపై గ్రామస్తుల ఆగ్రహం
తిరుపతి జిల్లా దామినేడులో ఘోరం జరిగింది. ఇనాం భూమిలో ఉన్న పురాతన నాగాలమ్మ ఆలయాన్ని తన భూమిగా పేర్కొంటూ కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి కూల్చేశాడు. ఆలయ ఆనవాళ్లను తొలగించడంతో గ్రామస్థులు శనివారం ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. అతడు అనుచరులతో కలిసి గ్రామస్తులపై దాడి చేయగా, వారు తిరగబడి తరిమికొట్టారు. కొన్నేళ్లుగా ఈ స్థలం వివాదాస్పదంగా ఉంది.

సంబంధిత పోస్ట్