తిరుపతి సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులుగా ఎన్. వేలాయుధం బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి కలెక్టరేట్‌లోని శాఖ కార్యాలయంలో విధుల్లో చేరారు. గతంలో ఆయన తిరుపతి, రాజంపేట, అనంతపురం డివిజన్లలో డివిజనల్ పిఆర్ఓగా, అనంతపురంలో డీఐపీఆర్ఓగా, తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో ఏడీ(డీఐపీఆర్ఓ)గా సేవలందించారు. ప్రభుత్వ బదిలీ ఉత్తర్వుల మేరకు డైరెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశాలతో తిరుపతికి బదిలీ అయ్యారు.