పిచ్చాటూరు మండలంలోని వెంగళత్తూరు గ్రామంలో సోమవారం శివయ్యకు ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అర్చకుడు కుమార్ స్వామి శర్మ అభిషేకం నిర్వహించి, బిల్వదళాలతో పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. గురువులైన లోకేష్ దాస్ బృందంతో ఓంకార నామస్మరణ చేశారు. భక్తులు భారీగా పాల్గొన్నారు.