రాష్ట్ర ప్రజలకు కూటమి మోసాలపై అవగాహన కల్పించేందుకు 'వెన్నుపోటు' పుస్తకాన్ని తిరుపతిలో ఆదివారం వసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్. కే. రోజా, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, మాజీ ఎమ్మెల్యేలు సునీల్, విజయానంద రెడ్డిలు పాల్గొన్నారు. భూమన మాట్లాడుతూ ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.