రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు విజయరామరాజు బుధవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.