తిరుపతిలో ఉరివేసుకొని మహిళ మృతి

84చూసినవారు
తిరుపతిలో ఉరివేసుకొని మహిళ మృతి
తిరుపతి కొర్లకుంట మారుతి నగర్ లో ఉరివేసుకొని మహిళ మృతి చెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది. మృతురాలిని లక్ష్మి అమృత (27)గా గుర్తించారు. భార్యాభర్తల మధ్య కుటుంబ గొడవల నేపథ్యంలోని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భర్త వెంకట లోకేశ్ డెలివరీ బాయ్ కాగా వారికి పిల్లలు ఉన్నారు. వారు ఇంటిలో ఉండగానే బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని ఈస్ట్ డీఎస్పీ శ్రీలత పరిశీలించారు.

సంబంధిత పోస్ట్