తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ స్పందించారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అనేది ఓ కట్టు కథ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదని మండిపడ్డారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అంటూ జగన్ ప్రశ్నించారు. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా ? ఒక సీఎం ఇలా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? అని జగన్ ఫైర్ అయ్యారు.