తిరుపతి ప్రజల దాహార్తి తీర్చేందుకు రాపూరు మండలంలోని కండలేరు జలాశయం నుంచి ఆదివారం 250క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అడ్డంగా ఉన్న మట్టి కట్టను పొక్లెయిన్ ద్వారా తొలగించడంతో కండలేరు జలాలు సత్యసాయి గంగ కాలువ ద్వారా తిరుపతి వైపు సాగాయి. అవసరాన్ని బట్టి నీటి సామర్థ్యాన్ని పెంచుతామని కండలేరు ఎస్ఈ రమణారెడ్డి తెలిపారు. మధ్యలో అక్రమంగా నీటిని మళ్లించకుండా తిరుపతికి సాఫీగా ప్రవహించేలా ప్రజలు సహకరించాలన్నారు.