వెంకటగిరిలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ బుధవారం వెంకటగిరిలో ప్రభుత్వ భూ కబ్జాలపై పలు విషయాలను వివరించారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఉండదని చట్టాలు ఎవరికి చుట్టాలు కాదని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులేనని చెప్పారు. చట్టాల్లోని ఎన్నో అంశాలను తెలియజేస్తూ ప్రభుత్వ భూములు, స్థలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలపై ఉందన్నారు.