వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పెట్లూరు, మొగల్లగుంట, పంజాం గ్రామాల్లో బుధవారం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు డ్రోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, గ్రామస్తులు, అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.