సంక్రాంతి, భోగి, కనుమ పండగల సందర్భంగా కలువాయి ఎస్ఐ సుమన్ మండల వాసులకు శనివారం ముఖ్య సూచనలు చేశారు. ఊరికి వెళ్లే వారు ఇంటి వారికి సమాచారం ఇవ్వాలని, నగదు, బంగారం ఇంట్లో ఉంచకుండా వారి బ్యాంక్ ఖాతాల్లో వేసుకోవాలని సూచించారు. కోడి పంద్యాలు, జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలు చేబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.