నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి

69చూసినవారు
నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి
డక్కిలి మండలంలోని వెలుగు కార్యాలయ పరిధిలో పొదుపు సంఘ సభ్యులకు తెలియకుండా నిధులు స్వాహ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ జి. మునెయ్య డిమాండ్ చేశారు. దీనిపై మంగళవారం ఆయన ఎంపీడీవో లీలామాధురి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ చౌడయ్యకు ఫిర్యాదు చేశారు. సంఘాల్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్టు గుర్తించి వెలుగు నోటీసులు జారీ చేసిందే తప్ప వారిపై చర్యలు తీసుకోలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్