వెంకటగిరి–రాపూరు హైవేలో గుండ్లసముద్రం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి–కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు మోపూర్ నుంచి పొలం పనులు ముగించుకుని బైక్‌పై వెంకటగిరి వస్తున్న అమరావతి, ఆమె కుమారుడు శ్రీనాథ్‌ను రాపూరుకు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. గాయపడిన వారిని వెంటనే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.