టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వెంకటగిరి ఎమ్మెల్యే రామక్రిష్ణ ఆదివారం స్పందించారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. మత విద్వేషాలను సృష్టించేందుకు కరుణాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేవతలతో సమానంగా కొలిచే గోమాతలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.