యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లికి ఒప్పుకోని యువకుడి పై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లె మండలంలో ఆదివారం వెలుగు చూసింది. భైరవరం పంచాయతీకి చెందిన పోలయ్య ఓ యువతి (19)ని మూడేళ్లుగా ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవలే ఆమె 5నెలల గర్భిణి అని తేలింది. దీంతో పెళ్లి చేసుకోవాలని పోలయ్యను కోరగా. అతడు నిరాకరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలయ్య పై కేసు నమోదు చేశారు.