వెంకటగిరి లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న అన్నక్యాంటీన్‌ను ఎమ్మెల్యే రామకృష్ణ శనివారం పరిశీలించారు. భోజనం చేస్తున్న ప్రజలతో టిఫిన్, భోజనాల నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ ద్వారా ఎందరో ఆకలిని తీర్చుకుంటున్నట్లు ప్రజలు చెబుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆయనతో పాటు ఎంపీపీ తనూజ, కమిషనర్ వెంకటరామిరెడ్డి ఉన్నారు.