వెంకటగిరి పట్టణం క్రాస్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో శనివారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ ఆసనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, రూరల్ పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.