తల్లికి వందనం పథకాన్ని ఎన్నికల హామీలను విస్మరించి వంచనగా మార్చారంటూ వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి టీడీపీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం వెంకటగిరిలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు ఉండవని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు విద్యుత్ వాడకం, భూమి, ఆదాయం వంటి నిబంధనలు విధించడం దుర్మార్గమన్నారు. ఒక్క త్రైమాసిక ఫీజు రీయింబర్స్‌మెంట్ మాత్రమే చెల్లించారని చెప్పారు.