మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చెంగయ్య డిమాండ్ చేసారు. వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరగడంతో పాటు కమిషనరు వినతిపత్రం అందించారు. మాట్లాడుతూ. చనిపోయిన కార్మికులకు ఎక్స్రేషియా చెల్లించాలని, రిటైర్మెంట్ తర్వాత వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.