తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలంలో శుక్రవారం విషాదం నెలకొంది. చిలమనూరు గ్రామానికి చెందిన మోడే గిరి తన తండ్రి మోడే హరికృష్ణపై కత్తితో దాడికి యత్నించాడు. హరికృష్ణ ప్రాణాల భయంతో సుబ్బయ్య ఇంట్లో దాక్కుండగా, ఆగ్రహంతో గిరి సుబ్బయ్య, పోలమ్మపై దాడి చేశాడు. హరికృష్ణ, సుబ్బయ్యకు స్వల్ప గాయాలు, పోలమ్మకు తీవ్రగాయాలు అయ్యాయి. బాలాయపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.