రైతులను అన్ని విధాలా ఆదుకునేది టీడీపీనే అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. శుక్రవారం రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీతో వెంకటగిరి మార్కెటింగ్ కమిటీ ఆఫీసులో ఆయన రైతులకు అందజేశారు. గత ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వం రైతులకు ఒక్క యంత్ర పరికరం కూడా పంపిణీ చేయలేదని, రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సబ్సిడీతో విత్తనాలను, పురుగు మందులు, పరికరాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.